కోటదుర్గమ్మ హుండీల ఆదాయం రూ.11.62 లక్షలు
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:55 PM
ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత కోటదుర్గమ్మ ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు.
పాలకొండ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత కోటదుర్గమ్మ ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు. హుండీల ద్వారా అమ్మవారికి రూ.11,62.037 ఆదాయం సమకూరింది. మిక్స్‌డ్ బంగారం 11 గ్రామాలు 300 మిల్లీ గ్రాములు, మిక్స్‌డ్ వెండి 400 గ్రాములు లభించిందని దేవాదయశాఖ పాలకొండ డివిజన్ అధికారి ఎస్.రామారావు, ఆలయ ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు. ఈ హుండీలను మే 13 నుంచి ఆగస్టు 10 వరకు మొత్తం 89 రోజులకు లెక్కించినట్టు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాదశర్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసశర్మతో పాటు అమ్మవారి సేవకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.