కోటదుర్గమ్మ హుండీల ఆదాయం రూ.14.37 లక్షలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:17 AM
ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకులను శుక్రవారం లెక్కించారు.
పాలకొండ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకులను శుక్రవారం లెక్కించారు. అమ్మవారికి హుండీల ద్వారా రూ14,37,855 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 11 నుంచి 20 వరకు నిర్వహించిన దసరా ఉత్సవాల నేపఽథ్యంలో ఆలయంలోని 8 శాశ్వత హుండీలు, 9 తాత్కాలిక హుండీలు కలిపి మొత్తం 17 హుండీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 7 నుంచి 23 వరకు 18 రోజుల వ్యవధిలో హుండీలను అధికారులు తెరిచి లెక్కించారు. హుండీల్లో మిశ్రమ బంగారం, మిశ్రమ వెండి కానుకలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ తనిఖీదారు ఎస్.రామారావు, గ్రూప్ దేవాలయాలు-2 కార్యనిర్వహణాధికారి కె.పరమేశ్వరి పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కించారు.