Share News

Farmers' Welfare రైతుల సంక్షేమానికి ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:23 PM

Incentives for Farmers' Welfare గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల సంక్షేమం కోసం నాబార్డ్‌ అనేక రకాల ప్రోత్సహకాలను అందిస్తోందని, వాటిని వినియోగించుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. గురువారం సీతంపేటలో ఎఫ్‌పీవో(రైతు ఉత్పత్తిదారుల సంస్థ)షాప్‌ను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు.

 Farmers' Welfare  రైతుల సంక్షేమానికి ప్రోత్సాహకాలు
రైతులకు టార్పాలిన్‌లు పంపిణీ చేస్తున్న దృశ్యం

సీతంపేట, జూలై16(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల సంక్షేమం కోసం నాబార్డ్‌ అనేక రకాల ప్రోత్సహకాలను అందిస్తోందని, వాటిని వినియోగించుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. గురువారం సీతంపేటలో ఎఫ్‌పీవో(రైతు ఉత్పత్తిదారుల సంస్థ)షాప్‌ను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాబార్డు ఆధ్వర్యంలో గిరిజన రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు. పంటలను భద్రపరుచుకోవడానికి, నాణ్యతను కాపాడుకోవడానికి ఈ టార్పాలిన్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్‌ అన్నారు. గిరిజన రైతులకు అందజేస్తున్న రాయితీ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు గిరిజన రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలను అందించామని ఎమ్మెల్యే జయకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, నాబార్డు డీడీఎం దినేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏకలవ్య పాఠశాలల్లో భద్రతకు ప్రాధాన్యం

పార్వతీపురం, జూలై16(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వసతులు, విద్యా ప్రమాణాలపై రాజీ పడరాదని కలెక్టర్‌ ఆదే శించారు. గురువారం సంబంధిత అధికారులతో వర్చువల్‌గా సమీక్షించారు. హాస్టళ్లకు సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం, రెమెడి యల్‌ క్లాసులు, బ్రిడ్జి కోర్సులు , ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక పార్ట్‌టైం వైద్యుడిని అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Updated Date - Jul 16 , 2026 | 11:23 PM