Share News

Kalyanotsavam శ్రీవారి కల్యాణోత్సవానికి శ్రీకారం

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:16 AM

Inauguration of the Lord’s Kalyanotsavam ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో స్వామివారి కల్యాణ మహోత్సవానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఉభయ దేవస్థానాల పరిధిలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉ ఉత్సవాలు నిర్వహించనున్నారు.

 Kalyanotsavam  శ్రీవారి కల్యాణోత్సవానికి శ్రీకారం
ప్రత్యేక అలంకరణలో వేంకటేశ్వరస్వామి

గరుగుబిల్లి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో స్వామివారి కల్యాణ మహోత్సవానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఉభయ దేవస్థానాల పరిధిలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉ ఉత్సవాలు నిర్వహించనున్నారు. కాగా మంగళవారం దేవస్థానంలో ప్రధాన అర్చకుడు వీవీ అప్పలాచార్యులు ఆధ్వర్యంలో విశ్వక్ష్సేన ఆరాధన, పుణ్యహ వాచనం, రుత్విక్‌ వరుణ తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైర్మన్‌ ఎం.పకీరునాయుడు తదితరులు స్వామివారి కల్యాణానికి అవసరమైన పట్టు వస్త్రాలు, పూజా సామగ్రిని దేవస్థానానికి అందించారు. ఉత్సవ మూర్తులను ఈ నెల 29న ప్రత్యేకంగా అలంకరించి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో బి.శ్రీనివాస్‌, దేవస్థానాల అభివృద్ధి సేవా ట్రస్ట్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:16 AM