Share News

Legal Aid Clinic లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభం

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:52 PM

Inauguration of Legal Aid Clinic కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

 Legal Aid Clinic  లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌  ప్రారంభం
అర్జీదారుల సమస్యను తెలుసుకుంటున్న సబ్‌ కలెక్టర్‌

పార్వతీపురం, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొంతమంది న్యాయవాదులు, వలంటీర్లు, న్యాయసేవ సహాయకులు తమవంతు సహాయ సహకారాలు అందించారు. లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ వద్ద అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. న్యాయ సహాయం కోసం వచ్చిన వారికి అర్జీలు రాసి అధికారులకు అందించారు. కాగా పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

Updated Date - Feb 02 , 2026 | 11:52 PM