Share News

In the same manner అదే తీరు

ABN , Publish Date - Jun 19 , 2026 | 11:59 PM

In the same manner విజయనగరం సర్వజన ఆసుపత్రిలో డయాలసిస్‌ బ్లాక్‌ సిబ్బంది నిర్లక్ష్యం తరచూ చర్చనీయాంశమవుతోంది. ఇక్కడి వైద్యులు సమయానికి విధులకు రాకపోవడం, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై మీడియాలో కథనాలు వస్తున్నా మార్పు రావడం లేదు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది

In the same manner అదే తీరు
డయాలసిస్‌ బ్లాక్‌

అదే తీరు

డయాలసిస్‌ కేంద్రంలో మారని సిబ్బంది

ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో ఆ విభాగం తీరిది

విజయనగరం రింగురోడ్డు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): విజయనగరం సర్వజన ఆసుపత్రిలో డయాలసిస్‌ బ్లాక్‌ సిబ్బంది నిర్లక్ష్యం తరచూ చర్చనీయాంశమవుతోంది. ఇక్కడి వైద్యులు సమయానికి విధులకు రాకపోవడం, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై మీడియాలో కథనాలు వస్తున్నా మార్పు రావడం లేదు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. విధుల్లో ఉండాల్సిన డ్యూటీ డాక్టరు గైర్హాజరు కావడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు సిబ్బంది బాధ్యతారహితంగా సమాధానమిచ్చారు. ఆసుపత్రిలోని డయాలసిస్‌ బ్లాక్‌లో వైద్యులు సమయపాలన పాటించడం లేదని, అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండడం లేదని రోగుల నుంచి కొద్ది రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. డయాలసిస్‌ అవుతున్న సమయంలో రోగులకు బీపీ తగ్గిపోవడం, చలి, వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు సర్వసాధారణం. ఈ సమయంలో రోగి వద్ద ఉండాల్సిన డ్యూటీ డాక్టరు అందుబాటులో లేకపోతుండడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

- వార్డులో డాక్టర్లు లేక రోగులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ‘ఆంధ్రజ్యోతి’ అక్కడ ఖాళీగా వున్న డాక్టరు కుర్చీని, వార్డులోని పరిస్థితులను కెమెరాలో బంధించే ప్రయత్నం చేయగా అక్కడి సిబ్బంది ఒక్కసారిగా ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. ఇక్కడ ఫొటోలు తీయడానికి అనుమతి లేదని, బయటకు పొమ్మంటూ హూంకరించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే మీడియా ప్రతినిధుల పట్ల సిబ్బంది కనీస బాధ్యతగా వ్యహరించడం లేదని తరచూ విమర్శలు వినిపిస్తున్నాయి. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఆసుపత్రిలో తప్పులు జరుగుతుండడం వల్లే ఫొటోలు తీస్తే సిబ్బంది ఉలిక్కిపడుతున్నారన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట.

సందేహాలు ఎన్నో...

డయాలసిస్‌ యూనిట్లు నెఫ్రో ప్లస్‌ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. డయాలసిస్‌ అత్యంత కీలక విభాగం. డ్యూటీ డాక్టరు నిరంతరం అందుబాటులో ఉండాలి. నెఫ్రాలజీ వైద్యులు 15 రోజులకు ఒకసారి వచ్చి చూడాల్సి. కానీ ఈ రెండూ సరిగా జరగడం లేదు. వరుసుగా ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. రోగుల భద్రతను ఎవరు చూస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. డయాలసిస్‌ కేంద్రంలో నెలకొన్న పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రోగుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌ వైద్య సేవ కో-ఆర్డినేటర్‌ సాయిరామ్‌ వద్ద ఆంధ్రజ్యోతి ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Jun 19 , 2026 | 11:59 PM