హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ పేరుతో దోపిడీకి పాల్పడితే చర్యలు: ఎస్పీ
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:14 AM
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమి షన్, ఆర్టీఐ అధికారుల పేరుతో దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్పీ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): నేషనల్ హ్యూమన్ రైట్స్ కమి షన్, ఆర్టీఐ అధికారుల పేరుతో దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్పీ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ఇటీవల కొంతమంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆర్టీఐ అధికారుల పేరుతో అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి.. వారి నుంచి డబ్బు లు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వ్యక్తుల స మాచారం అందిస్తే, వారిపై కఠిన చర్యలు చేపట్టి రౌడీషీట్స్ తెరుస్తామని ఆ యన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ గ్రామ స్థాయిలో ఎవరినీ సభ్యులుగా నియమించదని ఆయన తెలిపారు. ఇటీవల కొం తమంది హ్యూమన్ రైట్స్ కమిషన్ తనని సభ్యులుగా నియమించిందని చెప్పి.. అమాయక ప్రజలను మభ్యపెట్టి, బలవంతంగా వారి నుంచి డబ్బులు వసూలు కు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే కొంతమంది ఆర్టీఐ పేరుతో వసూళ్లుకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి వ్యక్తులు బెదిరింపులకు పాల్పడితే, స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు అందితే పోలీసులు కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.