Share News

పది రోజులుగా చీకట్లోనే..

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:39 AM

మండల కేంద్రం సీతంపేటలో పది రోజులుగా చీకట్లు కమ్ముకున్నాయి.

పది రోజులుగా చీకట్లోనే..
ప్రధాన రహదారిపై లైట్లు వెలగకపోవడంతో చీకటిగా ఉన్న దృశ్యం

-సీతంపేటలో వెలగని సెంట్రల్‌ లైటింగ్‌

- పట్టించుకోని పంచాయతీ అధికారులు

సీతంపేట,అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం సీతంపేటలో పది రోజులుగా చీకట్లు కమ్ముకున్నాయి. ప్రాథ మిక పాఠశాల ఆవరణలో పది రోజుల కిందట పిడుగుపడ డంతో ప్రధాన రహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం దెబ్బతిం ది. దీంతో దీపాలు వెలగకపోవడంతో రోడ్డుపైకి వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత పంచాయతీ ప్రత్యేకాధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపి స్తున్నారు. ఇప్పటికైనా మరమ్మతులు చేయించి వినియోగం లోకి తీసుకురావాలని కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి బి.రామకృష్ణను వివరణ కోరగా.. ‘పిడుగుపాటుకు ప్రధాన రహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం కొంతవరకు దెబ్బతిందని, త్వరలోనే విద్యుత్‌ సిబ్బందితో మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకువస్తాం.’అని అన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 12:39 AM