Share News

మహిళా బిల్లుకు మద్దతుగా..

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:18 PM

మహిళా బిల్లుకు మద్దతుగా జిల్లా ప్రజా ప్రతినిధులు గురువారం ఢిల్లీ వెళ్లారు.

మహిళా బిల్లుకు మద్దతుగా..
ఢిల్లీలో మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యే మాధవి, జనసేన నాయకురాలు యశస్విని

- ఢిల్లీలో వెళ్లిన జిల్లా ప్రజాప్రతినిధులు

పార్వతీపురం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లుకు మద్దతుగా జిల్లా ప్రజా ప్రతినిధులు గురువారం ఢిల్లీ వెళ్లారు. మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి ఢిల్లీ వెళ్లారు. వీరివెంట విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు ఇన్నాళ్లకు మోక్షం కలగనుందని, మహిళా పక్షపాతిగా ఎన్‌డీఏ ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. మహిళా బిల్లు ఆమోదం పొందితే మహిళలకు చట్టపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. సమాజంలో మహిళలను గౌరవించే ఏ దేశమైనా, రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 11:18 PM