డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:30 PM
: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి పిలుపునిచ్చారు.
భాగస్వామ్యం కావాలి
- కలెక్టర్, ఎస్పీ పిలుపు
-పార్వతీపురంలో అవగాహన ర్యాలీ
బెలగాం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం పురస్కరించుకొని గురువారం పార్వతీపురం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నశాముక్త్ భారత్.. నశాముక్త్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా యం త్రాంగం సమష్టిగా పనిచేస్తుందన్నారు. గత ఏడాది కాలంగా జిల్లాలోని ప్రతీ పాఠశాల, కళాశాలలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లా విద్యారంగంలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. పదో తరగతి, ఇటర్మీడియట్ ఫలితాలతో పాటు వివిధ ప్రవేశ పరీక్షల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నార న్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలకు సంబంధించి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడతున్నారని తెలిపారు. పట్టణంలోని ప్రధాన వీధులగుండా సాగిన ఈ ర్యాలీలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు.