Share News

Livelihood Opportunities జీవనోపాధి మెరుగుపరుచుకోవాలి

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:45 PM

Improve Livelihood Opportunities రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీజీ) జీవనోపాధిని మెరుగుపరుచుకుని.. ఆదాయం పెంపే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర సెర్ప్‌ ఎడిషనల్‌ డైరెక్టర్‌ మహిత తెలిపారు. స్థానిక ఎంఎంఎస్‌ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మహిళలు లక్షాధికారులు అయినప్పుడే కుటుంబాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు.

  Livelihood Opportunities జీవనోపాధి మెరుగుపరుచుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న సెర్ప్‌ ఏడీ మహిత

సీతంపేట రూరల్‌,జూలై 8(ఆంధ్రజ్యోతి): రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీజీ) జీవనోపాధిని మెరుగుపరుచుకుని.. ఆదాయం పెంపే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర సెర్ప్‌ ఎడిషనల్‌ డైరెక్టర్‌ మహిత తెలిపారు. స్థానిక ఎంఎంఎస్‌ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మహిళలు లక్షాధికారులు అయినప్పుడే కుటుంబాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. గిరిజన మహిళలు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా లభించే వెదురు, మునగ ఆకులతో కూడా వ్యాపారం చేసి ఆదాయం సంపాదించొచ్చన్నారు. పోలవరంలో వెదురు మేకింగ్‌ యూనిట్‌ ద్వారా అక్కడ మహిళలు ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. వెదురు పంట ద్వారా మూడేళ్లలోనే ఆదాయం పొందవొచ్చని వివరించారు. మూడేళ్లలో ఎఫ్‌పీజీలు అన్ని ఆర్థికంగా బలోపేతం కావాలని, మొదటివిడతలో 1200కుటుంబాలను ఎంటర్‌ప్రెన్యూర్‌ (పారిశ్రామిక వేత్తలుగా)తయారుచేయాలని ఆదేశించారు. ఇందుకోసం వీరికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి అవసరం మేరకు రుణాలు మంజూరుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, సెర్ప్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శ్రీను, ఏపీడీ చిరంజీవి, డీపీఎం రమణ, ఏపీఎం కమలకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 11:45 PM