Skills అభ్యసనా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలి
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:52 PM
Improve Learning Skills ఇంటర్ విద్యార్థులు తమ అభ్యసనా సామర్థ్యాన్ని మెరుగుపర్చు కోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) హరగోపాల్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. బుధ వారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భామిని, జూలై15(ఆంధ్రజ్యోతి): ఇంటర్ విద్యార్థులు తమ అభ్యసనా సామర్థ్యాన్ని మెరుగుపర్చు కోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) హరగోపాల్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. బుధ వారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, రికార్డులు, ప్రాక్టికల్ మాన్యువల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి అంశాన్ని లోతుగా అభ్యసిస్తే ఉన్నత విద్యతో పాటు పోటీల పరీక్షల్లోనూ విజయాలు సాధించొచ్చని తెలిపారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశించిన గడువులోగా సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులను సమర్థంగా నిర్వహించే బాధ్యత ప్రిన్సిపాళ్లపై ఉందన్నారు. ఈ పరిశీలనలో కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు, అధ్యాపకులు సత్యనారాయణ, జి.నారాయణరావు తదితరులు ఉన్నారు.