ఆకట్టుకున్న గుర్రాల పరుగు పందెం
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:54 PM
చందులూరు గ్రామంలోని దేవి తీర్థ మహోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన గుర్రపు పందాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మొత్తం 12 గుర్రాలుపందెంలో పాల్గొన్నాయి
లక్కవరపుకోట, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): చందులూరు గ్రామంలోని దేవి తీర్థ మహోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన గుర్రపు పందాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మొత్తం 12 గుర్రాలుపందెంలో పాల్గొన్నాయి. రామన్న పాలే నికి చెందిన విక్రమ్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానం దేవరాపల్లికి చెందిన నవీన్ చిన్ని గుర్రం సాధించింది. మూడు, నాలుగు స్థానాల్లో సిం గపూర్ సత్యనారాయణ, దీర అప్పన్న పాలెం గుర్రా లు నిలిచాయి. విజేతలకు గ్రామ పెద్దలు బహు మతులు అందజేశారు.