ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:00 AM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తెలిపారు. బుధవారం జిల్లావ్యాప్తంగా ఇంటింటికి టీడీపీ కార్య క్రమం నిర్వహించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తెలిపారు. బుధవారం జిల్లావ్యాప్తంగా ఇంటింటికి టీడీపీ కార్య క్రమం నిర్వహించారు.
ఫగంట్యాడ ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని నరవలో నిర్వహించిన ఇంటింటికీ టీడీపీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు సం బంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీచేశారు. కార్యక్రమంలోని టీడీపీ మండలా ధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, నాయకలు సుంకరి రామునాయుడు, రంధి చినరామునాయుడు, సుంకరి సాయి కృష్ణ, సున్నపు రామస్వామి పాల్గొన్నారు.
ఫభోగాపురం, ఆగస్టు26(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజల్లో సంతోషం కనిపిస్తోందని మార్కెఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. బుధవారం మండలంలోని ముంజేరులో రెం డేళ్ల నమ్మకం- అభివృద్ధి-సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటిం టికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న పఽథకాలు, అభివృద్ధి పనులు, సంక్షేమానికి సంబం దిత కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలోటీడీపీ మండలాధ్యక్షులు కర్రోతు సత్య నారాయణ, పిడుగు వెంకట సత్యం, కర్రోతు రాజు, పిడుగు చందు పాల్గొన్నారు.