ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు
ABN , Publish Date - May 17 , 2026 | 12:10 AM
22
వీరఘట్టం, మే 16 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిందని టీడీపీ అరకు పార్లమెంట్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు ఎం.తేజోవతి తెలిపారు. శనివారం వీరఘట్టంలో ప్రజాదర్బార్‌తో పాటు క్యాడర్‌తో సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు పార్టీలో ఉన్నారన్నారు. భోగాపురం విమానాశ్రయం, మూలపేటపోర్టు, స్టీల్‌ప్లాంట్ నిర్మాణాల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా సాగుతొందన్నారు. టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి మాట్లాడుతూ టీడీపీ మండలాధ్యక్షుడిగా సాసుబిల్లి వెంకటరమణ, వీరఘట్టం పట్టణ అధ్యక్షుడిగా తూముల మహేష్‌ను పార్టీ అధిష్టానం నియమించిందని తెలిపారు. కార్యకమంలో ఖండాపు వెంకటరమణ, తూముల రమేష్, గుమ్మిడి సింహాద్రి, గజేంద్రనాయుడు పాల్గొన్నారు.