స్వచ్ఛ సర్వేక్షణ్ పక్కాగా అమలు చేయండి
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:01 AM
పార్వతీపురం మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ను పక్కాగా అమలు జరిగేలా చూడాలని సబ్ కలెక్టర్ వైశాలి అన్నారు.
పార్వతీపురం టౌన్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ను పక్కాగా అమలు జరిగేలా చూడాలని సబ్ కలెక్టర్ వైశాలి అన్నారు. బుధవారం పట్టణంలోని 18, 19వ వార్డుల్లో పారిశుధ్య నిర్వహణను ఆమె పరిశీలించారు. కోవెల వీధి, హరిజన వీధి, గెడ్డ వీధిల్లో పారిశుధ్యంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పార్వతీపురం మున్సి పాలిటీని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాలుష్య రహిత ఉత్తమ మున్సి పాలిటీగా నిలిపేందుకు ప్రజారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది శ్రమిం చాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుధ్య నిర్వహణలో ఉత్తమ మున్సిపా లిటీగా నిలిపేందుకు ఇప్పటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉందని మున్సి పల్ కమిషనర్ పావనిని ఉద్దేశించి అన్నారు.