Share News

జీవో నెంబర్‌ 3ను అమలు చేయండి

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:23 AM

గిరిజనులకు సంబంఽధించిన జీవో నెంబర్‌ 3ను అమలు చేయాలని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరిని మన్యం జిల్లా గిరిజన సంఘం నాయకులు కోరారు.

జీవో నెంబర్‌ 3ను అమలు చేయండి
వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

గుమ్మలక్ష్మీపురం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు సంబంఽధించిన జీవో నెంబర్‌ 3ను అమలు చేయాలని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరిని మన్యం జిల్లా గిరిజన సంఘం నాయకులు కోరారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో ఆమెకు గిరిజనుల సమస్యలపై వారు వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు భూములు, గిరిజనులకు సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాలను షెడ్యూల్డ్‌ గ్రామాలుగా మార్చాలన్నారు. సవర భాషా వలంటీర్లకు గౌరవవేతనం పెంచాలన్నారు. కొండ శిఖర గ్రామాలకు రహ దారులు మంజూరు చేయాలని, ఆదివాసీలపై ఫారెస్ట్‌ అధికారులు దౌర్జన్యం చేయకుండా చూడాల న్నారు. గిరిజన విద్యార్థుల మరణాలు అరి కట్టాలని, గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని వినతిపత్రంలో పేర్కొ న్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, ఎంపీటీసీ సభ్యుడు రమణ, సీపీఎం నాయకుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:23 AM