Share News

Lunar Eclipse చంద్రగ్రహణం ప్రభావం

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:52 PM

Impact of the Lunar Eclipse చంద్రగ్రహణం కారణంగా మంగళవారం జిల్లాలో పలు దేవాలయాలు మూతపడ్డాయి. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు.

  Lunar Eclipse చంద్రగ్రహణం ప్రభావం
తోటపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం తలుపులు మూసివేస్తున్న అర్చకుడు

గరుగుబిల్లి, మార్చి3(ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం కారణంగా మంగళవారం జిల్లాలో పలు దేవాలయాలు మూతపడ్డాయి. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం 9 గంటలకు ప్రధాన తలుపులను ప్రధాన అర్చకుడు వీవీ అప్పలాచార్యులు మూసివేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో బి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. బుధవారం గ్రహణ ఉభయ దేవాలయాల్లో సంప్రోక్షణ చర్యలు చేపడతామన్నారు. అన ంతరం భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.

ఆరు నిమిషాలే...

సాలూరు రూరల్‌, మార్చి3(ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం సాలూరులో మంగళవారం సాయంత్రం కేవలం ఆరు నిమిషాలే కనిపించింది. మధ్యాహ్నం 3.19 గంటలకు గ్రహణం ఆరంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగిసింది. జిల్లా అంతటా సాయంత్రం 6.41 గంటల వరకు వెలుతురు ఉండడంతో చాలామంది చంద్రగ్రహణ దృశ్యం వీక్షించలేకపోయారు. సాయంత్రం 6.42 గంటలకు చీకటి పడడంతో చంద్రగ్రహన విడుపు దృశ్యాన్ని వీక్షించి ఆనందించారు. గ్రహణ విడుపు అనంతరం పలువురు గ్రహణ స్నానం చేసి దానాలు చేశారు. ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలను ఆరంభించారు.

Updated Date - Mar 03 , 2026 | 11:52 PM