కదలని గజరాజులు
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:48 AM
రెండు రోజులుగా ఆకులకట్ట పరిసరప్రాంతాల్లో గజరాజులు సంచరిస్తున్నాయి.
బాడంగి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా ఆకులకట్ట పరిసరప్రాంతాల్లో గజరాజులు సంచరిస్తున్నాయి. దాంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం నుంచి ఆకులకట్ట నుంచి గూడెపువలస అప్పలనాయుడు చెరువు ప్రాంతంలో సంచరిస్తున్నాయి. దీంతో వాడాడ, రేజేరు, గూడెపువలస, పాల్తేరు, బొత్సవానివలస గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణం ఊరిపై వచ్చి పడతాయని బిక్కుబిక్కుమంటున్నారు. ఏనుగుల కదలికలను ఫారెస్టు, రెవెన్యూ, పోలీస్ అధికారులు గుర్తిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.