ఏనుగులతో భయం భయంగా..
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:16 AM
మండలంలోని పెదమేరంగి, రామి నాయుడువలస గ్రామాల మధ్య గజరాజులు సంచరిస్తున్నాయి.
జియ్యమ్మవలస, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదమేరంగి, రామి నాయుడువలస గ్రామాల మధ్య గజరాజులు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం రామినాయుడువలస నుంచి జోగిరాజుపేట.. అక్కడి నుంచి కురుపాం మండలం పూతికవలసకు గజరా జులు చేరుకున్నాయి. సాయంత్రానికి మళ్లీ రామినాయుడువలస, పెదమేరంగి మధ్య పంట పొలాల్లో తిష్ఠ వేశాయి. అరటి, మొక్కజొన్న, చెరకు, వరి పంటలను తీవ్రంగా నష్టపరుస్తూ ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏనుగుల ను త్వరగా ఇక్కడి నుంచి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏనుగు లు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడరాదని... పంట పొలాలకు వెళ్లేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.