Share News

I'm Dying నేను చనిపోతున్నా

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:11 AM

"I'm Dying" ‘నేను చనిపోతున్నా’ అంటూ భర్తకు ఫోన్‌ చేసింది. అతను వచ్చేవరకు వేచిచూసింది. భర్తను చివరిసారిగా చూసుకుంది. వద్దు వద్దు అని వారిస్తుండగానే జలాశయంలోకి దూకేసింది. ఈ విషాద ఘటన పాచిపెంట మండలంలో గురువారం చోటుచేసుకుంది.

I'm Dying నేను చనిపోతున్నా
నందిని (ఫైల్‌)

  • చూస్తుండగానే జలాశయంలో దూకిన వైనం

  • గాలింపు చేపట్టిన పోలీసులు

  • వేధింపులే అంటున్న తల్లిదండ్రులు

‘నేను చనిపోతున్నా’ అంటూ భర్తకు ఫోన్‌ చేసింది. అతను వచ్చేవరకు వేచిచూసింది. భర్తను చివరిసారిగా చూసుకుంది. వద్దు వద్దు అని వారిస్తుండగానే జలాశయంలోకి దూకేసింది. ఈ విషాద ఘటన పాచిపెంట మండలంలో గురువారం చోటుచేసుకుంది.

పార్వతీపురం, జూలై 9(ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలం కూనబందవలసకి చెందిన నందిని(26), విశ్వనాథపురం గ్రామానికి చెందిన తెర్లింగి సతీష్‌ పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. నందిని పి.కోనవలస గిరిజన బాలికల కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. సతీష్‌ ఆటో డ్రైవర్‌. మద్యానికి బానిసఅయ్యాడు. భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. గురువారం మధ్యాహ్నం విధులు ముగించుకున్న నందిని పెద్దగెడ్డ జలాశయం వద్దకు వచ్చింది. అక్కడి నుంచి భర్తకు ఫోన్‌ చేసి తాను చనిపోతున్నానని చెప్పింది. భర్త ఫోన్‌లోనే వద్దని వారించాడు. హుటాహుటిన జలాశయం వద్దకు చేరుకున్నాడు. భర్త వచ్చాక చివరిచూపు చూసిన నందిని జలాశయంలోకి దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు జలాశయంలో నందిని కోసం గాలింపు చేపట్టారు. చీకటిపడినా అచూకీ లభ్యం కాలేదని ఎస్‌ఐ అర్జున తెలిపారు. భర్త వేధింపుల వల్లే నందిని జలాశయంలో దూకినట్లు ఆమె సోదరుడు, తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Updated Date - Jul 10 , 2026 | 12:11 AM