Share News

ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:08 AM

స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు సహకారంతో నగరాభివృద్ధికి శతశాతం కృషి చేస్తానని కూటమి మేయర్‌ అభ్యర్థి అవనాపు భార్గవి తెలిపారు.

ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

  • టీడీపీ మేయర్‌ అభ్యర్థి అవనాపు భార్గవి

  • ఎమ్మెల్యే అదితితో కలిసి ఎన్నికల ప్రచారం

విజయనగరం టౌన్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు సహకారంతో నగరాభివృద్ధికి శతశాతం కృషి చేస్తానని కూటమి మేయర్‌ అభ్యర్థి అవనాపు భార్గవి తెలిపారు. ఎమ్మెల్యే అదితితో కలిసి ఆమె శనివారం విజయనగ రంలోని 52, 53, 54 డివిజన్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా వారికి స్థానికులు హారతులు పట్టారు. అనంతరం గణేష్‌ కోవెల కూడలి లో ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశంలో ఆమె మాట్లాడారు. మేయర్‌ అభ్యర్థిగా తనను, అలాగే 52వ డివిజన్‌ అభ్యర్థి అక్రబాని అనితను, అలాగే 53 డివిజ న్‌ అభ్యర్థి సువ్వారి అనురాధా బేగంను, 54 డివిజన్‌ అభ్యర్థి మైలపల్లి పైడిరాజులను గెలిపించాలని కోరా రు. తనను గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మేయర్‌గా అవనాపు భార్గవి కి ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. ప్రతిపక్ష నేతల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రతిపక్ష మేయర్‌ అభ్యర్థి కోలగట్ల శ్రావణి తన తండ్రి అశోక్‌తో ఆమె తండ్రిని పోల్చి మాట్లాడటం నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అని ఎద్దేవా చేశారు. 53వ డివిజన్‌ అభ్యర్థి సువ్వారి అనురాధా బేగం మాట్లాడు తూ ముస్లిం కుటుంబాలను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. తన వార్డులో ఎవరినైనా బెదిరిస్తే వారికి ఇవే చివరి ఎన్ని కలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ డివిజన్‌ అభ్యర్థులు అక్రబాని అనిత, మైలపల్లి పైడిరాజు, ఐవీపీ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:08 AM