Share News

If You Speak Telugu తెలుగు మాట్లాడితే ఇక్కడ ఉండొద్దు

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:09 AM

“If You Speak Telugu, You Should Not Stay Here.” తెలుగులో మాట్లాడితే ఒడిశాలో ఉండొద్దని ఆ రాష్ట్ర అధికారులు హెచ్చరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని దొర్లతాడివలస, కొఠియా గిరిజనులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. సాలూరు మండల పరిధి వివాదాస్పద కొఠియా గ్రూపులోని 21 గిరిజన గ్రామాల్లో ఒడిశా అధికారుల తీరు దారుణంగా ఉందని వారు తెలిపారు. తమపై దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు.

 If You Speak Telugu  తెలుగు మాట్లాడితే  ఇక్కడ ఉండొద్దు
కొఠియా, దొర్లతాడివలస గిరిజనులతో మాట్లాడుతున్న ఇన్‌చార్జి ఇన్‌చార్జి జేసీ

  • పోలీసులతో భయబ్రాంతులకు గురిచేస్తున్న వైనం

  • రక్షణ కల్పించాలని దొర్లతాడివలస, కొఠియా గిరిజనుల డిమాండ్‌

  • పార్వతీపురం కలెక్టరేట్‌ ఎదుట నిరసన

  • ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జేసీకి వినతి

పార్వతీపురం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలుగులో మాట్లాడితే ఒడిశాలో ఉండొద్దని ఆ రాష్ట్ర అధికారులు హెచ్చరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని దొర్లతాడివలస, కొఠియా గిరిజనులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. సాలూరు మండల పరిధి వివాదాస్పద కొఠియా గ్రూపులోని 21 గిరిజన గ్రామాల్లో ఒడిశా అధికారుల తీరు దారుణంగా ఉందని వారు తెలిపారు. తమపై దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. సుమారు 2 వేల మంది పోలీసులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. తమకు తెలుగు భాష తప్ప మరొకటి రాదని.. కానీ ఆ రాష్ట్ర అధికారులు మాత్రం ఒప్పుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. కొద్దిరోజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో తాము ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలికి వినతిపత్రం అందించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఎస్పీతో మాట్లాడి.. ఒడిశా పోలీసులు దూకుడుకు కళ్లెం వేస్తామన్నారు. కొఠియా గిరిజనులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Nov 17 , 2026 | 12:09 AM