If you participate in the Olympics, the whole world watches. ఒలింపిక్స్‌లో పాల్గొంటే ప్రపంచమే చూస్తుంది
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:57 PM
If you participate in the Olympics, the whole world watches. ఒలింపిక్స్‌లో ఒకసారి పాల్గొంటే ప్రపంచమే మీవైపు చూస్తుందని, విజయనగరంలో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారంతా లక్ష్యంతో సాధన చేసి జిల్లా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
ఒలింపిక్స్‌లో పాల్గొంటే ప్రపంచమే చూస్తుంది
క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలి
యువత సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోకూడదు
ఒలింపిక్‌డే రన్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్
విజయనగరం/టౌన్, జూన్ 28(ఆంధ్రజ్యోతి):
ఒలింపిక్స్‌లో ఒకసారి పాల్గొంటే ప్రపంచమే మీవైపు చూస్తుందని, విజయనగరంలో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారంతా లక్ష్యంతో సాధన చేసి జిల్లా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. యువత సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోకుండా క్రీడా మైదానాలకు వెళ్లాన్నారు. ఒలింపిక్ డేను పురస్కరించుకుని ఆదివారం నగరంలోని కోట వద్ద క్రీడాజ్వోతిని వెలిగించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి ఒలింపిక్ రన్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఇటు దేహదారుఢ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చునన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేస్తున్నాయని గుర్తుచేశారు. తొలుత జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు వల్లూరి శ్రీనువాసరావు, బంగారు ఉష, పల్లవితో పాటు కోచ్‌లు పి.సతీష్, జి.నరసింగరావు, కృష్ణారెడ్డి, శాంతారావు, రామారావులను సన్మానించారు. తాను మంత్రి కాకముందు క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం అందించానని, పారా అథ్లెటిక్స్‌కి తన సొంత నిధులతో పలువురిని బెల్జియం పంపానన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోషియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, వెలమ సంక్షేమ సంఘం డైరెక్టర్ కోల్‌నాయుడు, జిల్లా కబట్టీ సంఘ అధ్యక్షుడు అవనాపు విజయ్, జిల్లా స్కూల్స్‌గేమ్స్ కార్యదర్శి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.