మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే..
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:58 PM
జిల్లాలోని పోలీసుస్టేషన్ల పరిధి లో మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారికి జైలుశిక్ష తప్పదని ఎస్పీ దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
ఎస్పీ దామోదర్
107మందికి రూ.10లక్షల 70వేలు జరిమానా
విజయనగరం క్రైం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పోలీసుస్టేషన్ల పరిధి లో మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారికి జైలుశిక్ష తప్పదని ఎస్పీ దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడిపిన 107 మందిని పట్టుకుని, కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచ గా.. విజయనగరం అడిషనల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఎంఎస్‌హెచ్‌ఆర్ తేజా చక్రవర్తి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.10లక్షల 70వేలు జరిమానా విధించారని ఎస్పీ తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఇకపై మద్యం తాగి, వాహనాలు నడిపే వారిని జైలుకి పంపడం ఖాయమన్నారు.