Share News

అప్రమత్తంగా లేకుంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే’

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:33 AM

వాతావరణంలో రోజురోజుకు చోటుచేసుకుంటున్న ప్రతికూల పరిస్ధితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా లేకుంటే మానవాళి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఏపీఐఐసీ పర్యావరణ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ బడగల హరిధరరావు హెచ్చరించారు.

అప్రమత్తంగా లేకుంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే’
మాట్లాడుతున్న చీఫ్‌ ఇంజనీర్‌ హరిధరరావు

బొబ్బిలి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో రోజురోజుకు చోటుచేసుకుంటున్న ప్రతికూల పరిస్ధితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా లేకుంటే మానవాళి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఏపీఐఐసీ పర్యావరణ విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ బడగల హరిధరరావు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం స్ధానిక గ్రోత్‌ సెంటర్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం సుస్ధిర జీవనశైలి (మిషన్‌ లైఫ్‌) పేరుతో వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా స్ధానిక పరిశ్రమల నిర్వాహకులతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత కార్బన్‌ రీసోర్సెసెస్‌ కంపెనీ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హరిధరరావు మాట్లాడుతూ ప్రపంచాన్ని ఎల్‌నినో అతలాకుతం చేస్తోందన్నారు. దాని ప్రభావం పడకుండా ఏ ఒక్కరూ తప్పించుకోలేరన్నారు. నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎనర్జీని ఎలా పొదుపుచేయాలి, భూగర్భజలాలను ఎలా పెంపొందించు కోవాలన్న దానిపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలలో పెద్దఎత్తున కార్యక్ర మాలు జరగుతున్నాయన్నారు. పరిశ్రమల ప్రాంగణాల్లో 33 శాతం పచ్చదనానికి కేటాయించాలన్న నిబంధనను చాలా మంది తుంగలో తొక్కుతున్నారన్నారు. ఆ ఖాళీ స్ధలాలను చాలా మంది ఓపెన్‌ గోదాములుగా వినియోగించుకోవడం సరికాదన్నారు, వీటన్నింటినీ కాలుష్య నియంత్రణ మండలి పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. భూగర్భ జలాలను పెంచుకోవడానికి పెద్దఎత్తున ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ కరుణా కర్‌, శ్రీకాకుళం ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ కృష్ణప్రసాద్‌, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ జయచంద్ర, పలు పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 12:33 AM