Share News

‘అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే’

ABN , Publish Date - May 01 , 2026 | 12:49 AM

అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని మహ విద్యానంద గిరి మాతాజీ అన్నారు.

‘అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే’
మాతాజీని సత్కరిస్తున్న ఉత్సవ కమిటీ

పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని మహ విద్యానంద గిరి మాతాజీ అన్నారు. గురువారం రాత్రి కల్యాణ వేంకటేశ్వర స్వామి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఆమె ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. నిరంతరం భగవంతుని ఆరాధనలో మనమంతా ఉండాలన్నారు. సృష్టిలో ప్రతి ఒక్కరం భగవంతుని ఆరాధించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాన్ని రక్షించండం మనందరి లక్ష్యమన్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు విద్యానందగిరి మాతాజీని ఘనంగా సన్మానించారు.

Updated Date - May 01 , 2026 | 12:49 AM