నాణ్యత లోపిస్తే బిల్లులు కట్
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:23 AM
సిమెంట్ రోడ్ల పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లులు చెల్లించేది లేదని రాజాం మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు హెచ్చరించారు.
రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు
రాజాం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): సిమెంట్ రోడ్ల పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లులు చెల్లించేది లేదని రాజాం మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు హెచ్చరించారు. మునిసిపాల్టీ పరిధిలోని గాయత్రీ కాలనీలో రూ.8లక్షలతో చేపడుతున్న సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా ఎక్కువ కాలం మన్నిక ఉండే విధంగా నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారుల ను ఆదేశించారు. గతంలో నిర్మాణం చేపట్టిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నాణ్యతా లోపం కారణంగా శిథిలావస్థకు చేరుకున్నాయని.. ప్రస్తుత పనుల్లో నాణ్యత లోపించ కుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఆయన అధికారులకు సూచించారు. ఈయనతో పాటు ఏఈ పి.వెంకటరామరాజు ఉన్నారు.