‘విద్యార్థులు తగ్గితే పోస్టుల కుదింపు’
ABN , Publish Date - May 21 , 2026 | 11:46 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గితే ఉపాధ్యాయ పోస్టులు కుదింపు తప్పదని రాష్ట్ర బడిబాట పరిశీల కులు ఎం.జోజప్ప, డి.పూర్ణచంద్రరావు, టి.సతీష్‌కుమార్, ఈవీ నాగకృష్ణ స్పష్టం చేశారు.
గరుగుబిల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గితే ఉపాధ్యాయ పోస్టులు కుదింపు తప్పదని రాష్ట్ర బడిబాట పరిశీల కులు ఎం.జోజప్ప, డి.పూర్ణచంద్రరావు, టి.సతీష్‌కుమార్, ఈవీ నాగకృష్ణ స్పష్టం చేశారు. గురువారం పలు గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం విద్యా విధానంలో వినూత్న మార్పుల చోటుచేసుకున్నాయన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పన జరుగుతోందన్నారు. ఉపాధ్యాయులు విధిగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలని సూచిం చారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో 60 మంది విద్యార్థులు దాటి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. టీఆర్‌ఎన్ వలస, సాంబన్నవలసల్లో విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలలు మూతపడిన విషయాన్ని ప్రస్తావించారు. కార్యక్రమంలో ఎంఈవోలు పి.జోగారావు, కె.కొండలరావు, ప్రధానోపాధ్యా యులు ఎం.సింహాచలంనాయుడు, పి.మాధవనాయుడు, సీఆర్‌ఎంటీ బోను రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.