Share News

ఆర్టీసీ డిపోను ప్రైవేట్‌కు అప్పగిస్తే ఉద్యమం తప్పదు

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:08 AM

ఆర్టీసీ డిపో లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యమం తప్పదని నేషనల్‌ మజ్దూరు యూనియన్‌ జిల్లా కార్యదర్శి పీజీ రాఫెల్‌ హెచ్చరించా రు.

ఆర్టీసీ డిపోను ప్రైవేట్‌కు అప్పగిస్తే ఉద్యమం తప్పదు

  • నేషనల్‌ మజ్దూరు యూనియన్‌ జిల్లా కార్యదర్శి పీజీ రాఫెల్‌

విజయనగరం రింగురోడ్డు, ఫిబ్ర వరి 24(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ డిపో లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యమం తప్పదని నేషనల్‌ మజ్దూరు యూనియన్‌ జిల్లా కార్యదర్శి పీజీ రాఫెల్‌ హెచ్చరించా రు. మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ డిపో వద్ద ఎర్ర బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ, ఎలక్ట్రికల్‌ బస్సులు కొనుగోలు చేయాలన్న పేరుతో డిపోలను ప్రైవేటుకు అప్పగిస్తే, ప్రతిఘటి స్తామన్నారు. బీఎస్‌-5, 6 వాహనాలను ఆపరేట్‌ చేయగల డ్రైవర్లకు శిక్షణ ఇస్తే, విద్యుత్‌ బస్సులను ఎందుకు నడపలేరని ప్రశ్నించారు. తక్షణమే ప్రభు త్వం పినాకిల్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రతినిధు లు పీఎన్‌ అప్పడు, ఎస్‌ఆర్‌ రాజు, చంద్రమౌళి, ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:08 AM