Share News

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:58 PM

తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిఎడల చలో విజయ వాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని యూటీ ఎఫ్‌ నాయకులు హెచ్చరించారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు

  • యూటీఎఫ్‌ హెచ్చరిక

  • ఉపాధ్యాయుల రిలే దీక్షలు

తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిఎడల చలో విజయ వాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని యూటీ ఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయులు పలు చోట్ల మంగళవారం రిలే దీక్షలు చేపట్టారు. పీఆర్సీని ఏర్పాటుచేయాలని, ఐఆర్‌ను ప్రకటించాలని, డీఏ బకాయిలు, మెడికల్‌ బిల్లులు చెల్లించాలని కోరారు. విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - Mar 24 , 2026 | 11:58 PM