విగ్రహాల తయారీ పాక దగ్ధం
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:04 AM
మండలంలోని సంతపేట కూడలి వద్ద బొమ్మల తయారీ కేంద్రం కమ్ములపాక శనివారం అగ్నికి ఆహుతయ్యింది.
రూ.6 లక్షల ఆస్తి నష్టం
లక్కవరపుకోట, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని సంతపేట కూడలి వద్ద బొమ్మల తయారీ కేంద్రం కమ్ములపాక శనివారం అగ్నికి ఆహుతయ్యింది. రంగరాయపురం గ్రామానికి చెందిన ఎం.గోవింద అనే వ్యక్తి గత కొంతకాలంగా సంతపేట వద్ద వినాయక, దేవి, గౌరమ్మ విగ్రహాలను తయారు చేస్తున్నాడు. శనివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పాకలోని బొమ్మలతోపాటు ముడిసరుకు కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్.కోట అగ్నిమాపక వాహ నం వచ్చి మంటలను అదుపు చేసింది. ఆర్‌ఐ సన్యాసిరావు ఘటనా స్థలాన్ని పరి శీలించి.. నష్టపోయిన విషయాన్ని తహసీల్దార్‌కు వివరించారు. స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి, జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. జిల్లా అధికారులకు నష్టపోయిన విషయాన్ని వివరించారు. అన్ని విధాలా ఆదు కుంటామని భరోసా ఇచ్చారు.