‘ప్రతిభతోనే గుర్తింపు’
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:05 AM
ఉద్యానవన విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రతిభ కనపరిస్తేనే గుర్తింపు లభిస్తుందని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ కె.ధనంజయరావు అన్నారు.
గరుగుబిల్లి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఉద్యానవన విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రతిభ కనపరిస్తేనే గుర్తింపు లభిస్తుందని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ కె.ధనంజయరావు అన్నారు. బుధవారం సాయంత్రం ఉల్లిభద్ర డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన కళాశాల ఆవరణలో రెండో రోజు సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన వి ద్యార్థులు విద్యతో పాటు పలు విభాగాల్లో ముం దంజలో ఉండేందుకు ప్రయత్నం చేయాల న్నారు. వివిధ కళాశాలకు చెందిన 160 మంది పలు పోటీల్లో పాల్గొనడం అభినందనీయ మన్నారు. సాహిత్య సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన 20 విభాగాల్లో విద్యార్థు లు పాల్గొన్నారు. పోటీల్లో అధిక పాయింట్లును ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. రెండో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం కళాశాల నిలిచింది. ఇరు జట్లకు వీసీతో పాటు చైర్ పర్సన్ డా. సి.మధుమతి, డీన్ డా.బి.ప్రసన్న కుమార్, డా.సూర్యకుమారి, విజయపద్మ, అసోసియేట్ డీన్ డా.రాజ్యలక్ష్మి అభినందించారు.