‘నిరుపేదల గుర్తింపు పారదర్శకంగా చేపట్టండి’
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:30 AM
గ్రామాల్లో నిరుపేదల గుర్తింపే పార దర్శకంగా చేపట్టాలని డీఆర్‌డీఏ పీడీ సిహెచ్.ప్రభావతి అన్నారు.
మక్కువ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిరుపేదల గుర్తింపే పార దర్శకంగా చేపట్టాలని డీఆర్‌డీఏ పీడీ సిహెచ్.ప్రభావతి అన్నారు. బుధవారం స్థానిక వెలుగు కార్యాలయంలో వన్ డిస్ట్రిక్ట్, వన్ మండల్ జీరో పావర్టీ మిషన్ కార్యక్రమంలో భాగంగా మండలంలో గ్రామాల వారీగా నిరుపేద కుటుంబాల గుర్తింపుపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె గ్రామసంఘ సహాయకులకు నిరుపేద కుటుంబాల ఎంపికపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో అర్హులైన నిరుపేదలను ఎంపిక విషయంలో నిష్పక్షపాతంగా అత్యంత పారదర్శంగా జరగేలా చూడాలని ఏపీఎం, సీసీలను ఆదేశించారు. నిర్దేశించిన సమయంలోగా ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో వెలుగు మేనేజరు పి.శ్రీనివాసరావు, ఏపీఎం జయ కుమార్ పాల్గొన్నారు.