మృతదేహం గుర్తింపు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:10 AM
మండలంలోని అర్దానపాలెం గ్రామ సమీపంలో ఆదర్శ పాఠశాల వద్ద రోడ్డు పక్కనున్న మదుము కింద సుమారు 50ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు.
కొత్తవలస, మార్చి 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని అర్దానపాలెం గ్రామ సమీపంలో ఆదర్శ పాఠశాల వద్ద రోడ్డు పక్కనున్న మదుము కింద సుమారు 50ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. ఈ ప్రాంతం నుంచి దుర్వాసన రావడంతో విద్యార్థులు.. స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు వచ్చి చూడగా మృతదేహం ఉంది. మృతిచెందిన వ్యక్తి కొత్తవలస పంచాయతీ బలిఘట్టాం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్‌గా గుర్తించి.. కుటుంబీ కులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి చూశారు. అయితే మూడు రోజుల కిందట మస్తాన్ కనిపించడం లేదని పోలీసులకు కుటుంబీకులు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య మాట్లాడుతూ తన భర్త మృతిపై తనకు ఎటువంటి అనుమానాలు లేవని తెలిపింది. మద్యం ఎక్కువగా తాగి, మదుము మీద నుంచి కిందపడిపోవడం వల్లే మృతిచెంది ఉంటాడని తెలిపింది.