Share News

ఐసీడీఎస్‌ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలి

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:55 PM

ఐసీడీఎస్‌ కార్యక్రమాల అమలుకు సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయా లని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ బాలమణి సూచించారు.

ఐసీడీఎస్‌ కార్యక్రమాలను  సక్రమంగా అమలు చేయాలి

  • జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ బాలామణి

విజయనగరంటౌన్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఐసీడీఎస్‌ కార్యక్రమాల అమలుకు సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయా లని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ బాలమణి సూచించారు. జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగ ణంలో నెల్లిమర్ల ప్రాజెక్టుకు చెందిన అంగన్‌వాడీ సిబ్బందికి ఇస్తున్న శిక్షణను ఆమె మంగళవారం పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయా లని సూచించారు. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల విద్యాభ్యాసంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. పిల్లల అభివృద్ధి వివ రాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేయాలని ఆమె ఆదేశించారు. బలహీనంగా ఉన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీవో సత్యవతి, సూపర్‌వైజర్లు బి.శారద, త్రినాథ, ఉమా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:55 PM