శిక్ష పడుతుందేమోనని..
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:35 AM
తన భార్య మృతి కేసు లో తనకు శిక్ష పడుతుందేమోనని భయంతో లింగాలవలస గ్రామానికి చెందిన కనకల రామారావు(27) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
భయంతో యువకుడి ఆత్మహత్య
భోగాపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): తన భార్య మృతి కేసు లో తనకు శిక్ష పడుతుందేమోనని భయంతో లింగాలవలస గ్రామానికి చెందిన కనకల రామారావు(27) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక సీఐ దుర్గాప్రసాదరావు, ఎస్‌ఐ పాపారావు అందించిన వివరాల ప్రకారం.. లింగాలవలసకు చెందిన కనకల రామారావు అదే గ్రామానికి చెందిన అప్పటికే భర్తను కోల్పోయిన కనకల మధులక్ష్మిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కుమార్తె ఉంది. అయితే 2024 నవంబరు 27న మధులక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం, అనుమానంతో తన కుమార్తెను వేదించ డంతోనే మృతి చెందిందని అప్పట్లో మృతురాలి తల్లి కాల్ల పైడమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి, రామారావును రిమాండుకు తరలించారు. కొంత కాలం జైల్లో ఉన్న రామారావు ఇటీవల బైయిల్‌పై విడుదల అయి వచ్చాడు. అనంతరం రాజీ కోసం ఇరు కుటుంబాలవారు ప్రయత్నాలు చేశారు. అయితే మధులక్ష్మి కేసు ఈనెల 16న ట్రైయిల్‌కు వచ్చింది. దీంతో న్యా యస్థానంలో ఎక్కడ శిక్ష పడుతుందోనని భయంతో రామారావు ఆత్మహత్య చేసు కున్నాడు. తన మృతికి ఎవరూ కారణం కాదని, తనకు పెద్దలు ఎవరూ సహక రించలేదని, ఎవరి పేరూ బయటపెట్టనని, కుమార్తెను బాగా చూసుకోవాలని మృతుడి జేబులో లేటర్ రాసి ఉంది. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మృతుడి తల్లి రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పాపారావు తెలిపారు. అయితే మృతుడి కుమార్తె గతంలో తల్లిని కోల్పోయి, ప్రస్తుతం తండ్రిని కోల్పోయి అనాథగా మిగిలింది.