Share News

‘నారాయణపురం చీరల గిరాకీకి కృషి చేస్తా’

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:24 AM

నారాయణపురం చీరలకు విదేశాల్లో గిరాకీకి కృషి చేస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

‘నారాయణపురం చీరల గిరాకీకి కృషి చేస్తా’
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర

బెలగాం/ సీతానగరం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): నారాయణపురం చీరలకు విదేశాల్లో గిరాకీకి కృషి చేస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. బుధవారం బలిజిపేట మండలం నారాయణపురంలో చేనేత కార్మికులతో మాట్లాడారు. నారాయణపురం చీరలకు జియో టాకింగ్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక బ్యానర్‌తో దేశ, విదేశాల్లో ఇక్కడి కార్మికులకు గుర్తింపు వచ్చేటట్టు చేస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అర్హులైన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ ధ్రువపత్రాలను అందజేశారు. ముందుగా చేనేత కార్మికుల వద్ద చీరలు కొనుగోలు చేసి మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొప్పుల వెలమ డైరెక్టర్‌ జి.వెంకటనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పి.వేణుగోపాల నాయుడు, నాయకులు బి.రామ్మోహన్‌నాయుడు, బోను చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:24 AM