Share News

మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:24 AM

సాలూరును మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు పెద్దఎత్తున చేపడుతున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు.

మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.31 కోట్లు మంజూరు

సాలూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సాలూరును మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు పెద్దఎత్తున చేపడుతున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. స్థానిక మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు హెచ్‌ఏఎం ద్వారా రూ.21 కోట్లు, యూసీఎఫ్‌ ద్వారా రూ.10 కోట్లు వెరసి రూ.31 కోట్లు నిధు లు మంజూరయ్యాయన్నారు. మంగళవారం అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి సాలూరు మున్సిపాలిటీకి ఇప్పటివరకు రూ.143.7 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:25 AM