నగరవాసుల రుణం తీర్చుకుంటా
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:34 AM
తనకు ఒక్క అవకాశం ఇస్తే నగర వాసుల రుణం తీర్చుకుంటానని కూటమి మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి ఓటర్లను అభ్యర్థించారు.
విజయనగరం టౌన్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): తనకు ఒక్క అవకాశం ఇస్తే నగర వాసుల రుణం తీర్చుకుంటానని కూటమి మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి ఓటర్లను అభ్యర్థించారు. నగరంలోని వివేకా నంద కాలనీ, అలకానంద కాలనీలలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఆమె శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ గడిచిన పది రోజులుగా నగరంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు చూపిన అభిమానం వెలకట్టలేనిదన్నారు. తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వార్డుల్లో ప్రచారం చేస్తున్నప్పుడు అనే క సమస్యలను గుర్తించానని చెప్పారు. నగరానికి చేయాల్సింది ఎంతో ఉందని.. నగరవాసులకు ప్రభు త్వ పథకాలను చేరువ చేయాల్సిన అవసరం ఉంద న్నారు. ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నగరంలో అభివృద్ధి కుంటిపడిం దన్నారు. దాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా తీసుకు వెళ్తుందన్నారు. ప్రచారంలో భాగంగా ఆర్‌అం డ్‌బీ కూడలి వద్ద ఎంపీతో పాటు భార్గవి పోటా పోటీగా కర్రసాము చేసి ప్రచారాన్ని హోరెత్తించారు. టీడీపీ నేత ఐవీపీరాజు, ఆయా డివిజన్ల అభ్యర్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.