I will remain indebted to the people పదవి ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటా
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:25 AM
I will remain indebted to the people రాజకీయాల్లో ప్రోత్సాహం అందించిన చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల అభిమానానికి, జడ్పీ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించడానికి కారణమైన మెరకముడిదాం మండల ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఉద్యోగులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 20ఏళ్ల క్రితం పరోక్షంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని, అందుకు చీపురుపల్లి నియోజకవర్గం ఒక వేదికైందన్నారు.
పదవి ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటా
ఆత్మీయ వీడ్కోలు సభలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం కంటోన్మెంట్, సెప్టెంబరు 24, (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో ప్రోత్సాహం అందించిన చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల అభిమానానికి, జడ్పీ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించడానికి కారణమైన మెరకముడిదాం మండల ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఉద్యోగులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 20ఏళ్ల క్రితం పరోక్షంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని, అందుకు చీపురుపల్లి నియోజకవర్గం ఒక వేదికైందన్నారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు మెరకముడిదాం మండ లం రాజమార్గం చూపించిందని, వీరి అభిమానానికి రుణపడి ఉంటానన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు శాశ్వతమని, వ్యక్తులు అశాశ్వతమని చెప్పారు. ఉద్యోగుల సహాయ సహకారాలు లేనిదే ఏ ప్రజాప్రతినిధి సక్రమంగా సేవలు అందించలేరని, తనకు లభించిన పేరు ఉద్యోగులకే అంకితమన్నారు. తన హయాంలో 40మందికి కారుణ్య నియామకాలు ఇచ్చి వారి కుటుంబాలకు తోడ్పాటు అందించానని గుర్తు చేస్తూ భవిష్యత్తులో వారంతా ఎంపీడీవోలుగా పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివిధ విభాగాలకు చెందిన అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘనేతలు ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎ.లవరాజు, డీపీవో డీవీ మల్లిఖార్జునరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, పీఆర్ ఎస్‌ఈ డీఎల్ శ్రీనివాస్, ఈఈ రమణమూర్తి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు రమణమూర్తి, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అధికారులు, సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు.