టెట్‌పై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:49 PM
టెట్‌పై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. బుధవారంరాత్రి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును క్యాంపు కార్యాలయంలో ఏపీటీఎఫ్ నాయకులు కలిశారు.
రాజాం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): టెట్‌పై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. బుధవారంరాత్రి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును క్యాంపు కార్యాలయంలో ఏపీటీఎఫ్ నాయకులు కలిశారు. సర్వీసులోఉన్న ఉపాధ్యాయలకు టెట్ నుంచి మిన హాయింపు ఇచ్చేలా కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మధన్ మోహన్ తదితరులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలతేరు శ్రీనివాస్, నాయకులు షేక్ బుఖానిబాబు, ఎస్వీ రమణమూర్తి, బూరి అచ్యుతరావు, వంజ రాపు రవి, డి.మురళీమోహన్ పాల్గొన్నారు. అలాగే రాజాంలోని చీపురుపల్లి రోడ్డులోని జామియా మసీదులో రంజాన్ వేడుకల్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతోపాటు టీడీపీ నాయుకులు గురవాన నారాయణరావు, రౌతు వెంకటరమణ, మడ్డు హరి, పొన్నాడ చంటి పాల్గొన్నారు.