Share News

వసతిగృహంలో సమస్యలు రాకుండా చూస్తా..

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:16 AM

స్థాని క కళాశాల బాలికల వసతిగృహం దుస్థితిపై ‘ఇదే మెనూ.. పెట్టిందే తిను’ అనే శీర్షికతో శనివారం ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైన కథనానికి ఐసీడీఎస్‌ పీడీ బాలామణి స్పందించారు.

వసతిగృహంలో సమస్యలు రాకుండా చూస్తా..

  • ఐసీడీఎస్‌ పీడీ బాలామణి

విజయనగరం టౌన్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): స్థాని క కళాశాల బాలికల వసతిగృహం దుస్థితిపై ‘ఇదే మెనూ.. పెట్టిందే తిను’ అనే శీర్షికతో శనివారం ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైన కథనానికి ఐసీడీఎస్‌ పీడీ బాలామణి స్పందించారు. శనివారం ఆమె కళాశాల బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. అక్కడ వసతి పొందుతున్న విద్యార్థినులతో మా ట్లాడారు. బోరునీరే తాగుతున్నామని విద్యార్థినులు చెప్పడంతో త్వరలోనే వాటర్‌ఫిల్టర్‌ ఏర్పాటు చేయిస్తానని ఆమె చెప్పారు. అలాగే మరుగుదొడ్లు వారానికి మూడు సార్లు శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. ఉదయం అల్పాహారం అందడం ఆల స్యం అవుతోందని గ్రహించిన ఆమె.. ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు. విద్యార్థినులకు స్నాక్స్‌, పండ్లు సక్రమంగా అందుతున్నాయా.. లేదా.. ఆమె ఆరా తీశారు. కళాశాలలో సూపరింటెండెం ట్‌, వంట మనిషి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. వసతిగృహం భవనం పాతదే అయినప్పటికీ కళాశాలకు దగ్గరగా ఉండటం వల్ల విద్యార్థునులకు సౌకర్యవంతంగా ఉం దని తెలిపారు. వసతిగృహంలో ఇకపై ఎటువంటి సమ స్యలు రాకుండా దృష్టి సారిస్తానని ఆమె స్పష్టంచేశారు.

Updated Date - Apr 12 , 2026 | 12:16 AM