బకాయి బిల్లులు చెల్లించేలా చూస్తా..
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:59 PM
బల్లంకి గ్రామంలో అసంపూర్తిగా నిలిచిన పంచా యతీ, సచివాలయ భవన నిర్మాణాల బకాయి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటానని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే లలితకుమారి
వేపాడ, జనవరి 26(ఆంధ్రజ్యోతి): బల్లంకి గ్రామంలో అసంపూర్తిగా నిలిచిన పంచా యతీ, సచివాలయ భవన నిర్మాణాల బకాయి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటానని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హామీ ఇచ్చారు. సోమవారం ఆమె బల్లంకి గ్రామంలో నిర్వ హించిన మరిడిమాంబ తీర్థ మహోత్సవానికి హాజరై, అమ్మవారిని దర్శించుకు న్నారు. అనంతరం మాజీ సర్పంచ్ డీఎంనాయుడు ఆమెతో మాట్లాడారు. గతంలో నిర్మించిన భవనాలకు బిల్లులు చెల్లించకపోగా అసంపూర్తిగా నిలిచిన పంచాయతీ భవనం స్థానంలో కొత్తగా హోమియో ఆస్పత్రి భవనం నిర్మించే ప్రయత్నం చేస్తు న్నారని, అలాగే సచివాలయం భవనం వినియోగంలోకి వచ్చినప్పటికీ పెండింగ్ బిల్లులు నేటికీ చెల్లించలేదని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బకాయి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. జీసీసీ డైరెక్టర్ దాసరి లక్ష్మి, ఎంపీటీసీ తులసి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి పాల్గొన్నారు.