పెండింగ్ బిల్లులు అందేలా చూస్తా
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:04 AM
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లుల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు గ్రామాలకు చెందినవారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు వినతులు అందజేశారు.
మంత్రి శ్రీనివాస్
ప్రజా దర్బార్‌లో వినతుల వెల్లువ
గజపతినగరం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లుల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు గ్రామాలకు చెందినవారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు వినతులు అందజేశారు. శుక్రవా రం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈసందర్భంగా గజపతినగరం, దత్తిరా జేరు, బొండపల్లి, గంట్యాడ, జామి మండలాలకు చెంది న ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అంద జేశారు. గతంలో నియోజకవర్గం పరిధిలో రూ.120 కోట్లతో సీసీ రోడ్లు, గోశాలలు, నీటి తొట్టెలు, అంగన్వాడీ భవన నిర్మాణాలు చేపట్టిన పనులకు బిల్లులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవు తున్నామని వాపోయారు. అలాగే వైసీపీ హయాంలో అర్హులైన వారికి పింఛన్లు తొలగించారని, వాటిని పునరు ద్ధరించాలని కోరారు. గ్రామాల్లో విద్యుత్ సమస్య తలె త్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధిం చి పెండింగ్ బిల్లులు వారం రోజుల్లో వచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రూ.20లక్షల 900ల సీఎం రిలీఫ్ ఫండ్‌ను 14 మంది బాధితులకు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్య క్రమంలో ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, పీఏసీ ఎస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, జామి మండలాల టీడీపీ అధ్యక్షులు గంట్యాడ శ్రీదేవి, చప్పా చంద్రశేఖర్, రాపాక అచ్చుంనాయుడు, కొండపల్లి భాస్కరనాయుడు, అప్పలస్వామి పాల్గొన్నారు.