పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:44 PM
పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ డి.పావని అన్నారు.
పార్వతీపురం టౌన్, జనవరి1 (ఆంధ్రజ్యోతి): పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ డి.పావని అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా పట్టణంలో తాగునీటి సరఫరాకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నట్టుతెలిపారు. అంతేకాకుండా వచ్చే వేసవి కాలంలో పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాను ఎలాంటి అంతరాయం లేకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. అంతే కాకుండా 30 వార్డుల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి సమగ్ర అధ్యాయనం చేసి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయనే దానిపై ప్రజారోగ్యశాఖాధికారులతో చర్చిస్తామన్నారు. పట్టణాభి వృద్థికి అధికారులతో పాటు పాలకవర్గ సభ్యులు, ప్రజలు సహయ సహకారాలను అందించాలని కోరారు.