Share News

ఇళ్లు రానివారికి న్యాయం చేస్తా

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:16 AM

టిడ్కో ఇళ్లు రాని వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.

ఇళ్లు రానివారికి న్యాయం చేస్తా
డిపాజిట్‌దారులతో ఎమ్మెల్యే బేబీనాయన, కమిషనర్‌ రామలక్ష్మి

559 మందికి డిపాజిట్ల వాపసు

బొబ్బిలి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్లు రాని వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిడ్కో ఇళ్లు మంజూరు కాని వారికి గతంలో వారు చెల్లించిన డిపాజిట్లను వాపసు చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 70 శాతం టిడ్కో కాలనీ పనులు పూర్తయ్యాయన్నారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆ కాలనీలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించి ఉంటే వారికి క్రెడిట్‌ దక్కేదన్నారు. టిడ్కో ఇళ్లను కొంతమంది పేదలకు రద్దు చేసి వారికి ఎందుకూ పనికిరాని చోట పట్టాలు ఇచ్చి వైసీపీ చేతులు దులుపుకుందన్నారు. వివాదాలతో నిండిన స్ధలాల్లో పట్టాలు ఇచ్చారని, అలాంటి వారందరికీ న్యాయం చేస్తామన్నారు. ఇళ్ల కోసం డిపాజిట్లు చెల్లించిన వారికి ఇళ్లు మంజూరు చేయక, డిపాజిట్లు చెల్లించ కుండా గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు.. డిపాజిట్లు వాపసు చేయడంలో జరిగిన జాప్యానికి క్షమాపణ చెబుతున్నానని ఎమ్మెల్యే అన్నారు. మొత్తం 559 మందికి రూ.157.73 లక్షలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం తొలి విడతగా 66.63 లక్షలు విడుదలయ్యాయని, మిగిలిన వారందరికీ వారం పదిరోజుల్లో అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపల్‌ కమిషనర్‌ రామలక్ష్మ్మి మాట్లాడుతూ డిపాజిట్ల సొమ్ముకు ఎటువం టి అవకతవకలకు ఆస్కారం లేకుండా అందరికీ వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ చిట్టిరాజు, మున్సిపల్‌ మేనేజరు ఆచార్యులు, టీపీఆర్‌వో మామిడి జగన్మోహనరావ పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:16 AM