Share News

‘నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:13 AM

నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అన్నారు.

‘నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’
పనులను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

జియ్యమ్మవలస, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి విజయాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం శిఖబడి - జియ్యమ్మవలస వయా అప్పన్నదొరవలస రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం, అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి బొంగు సురేష్‌, అరకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, మండల కన్వీనర్‌ జోగి భుజంగరావు, నాయకులు, పంచాయతీరాజ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 12:13 AM