‘పెదపెంకిని అభివృద్ధి చేస్తా’
ABN , Publish Date - May 20 , 2026 | 12:08 AM
పెదపెంకి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయచంద్ర హామీ ఇచ్చారు.
సీతానగరం, మే 19 (ఆంధ్రజ్యోతి):పెదపెంకి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయచంద్ర హామీ ఇచ్చారు. మంగళవారం గ్రామంలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న వివిధ అబివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య ఉందని కొందరు తెలియజేయడంతో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని సామర్లకోటలో వినూత్నంగా మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మించి ఎంతో ప్రగతి సాధించారన్నారు. అదే స్ఫూర్తితో పెదపెంకి గ్రామంలో మ్యాజిక్ డ్రైనేజీలు చేపడుతున్నామన్నారు. ఇవి అది విజయవంతమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ సచివాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెదపెంకి పేరు వినగానే ఎంతో పెద్ద గ్రామంగా గుర్తింపు ఉందన్నారు. అదే సమయంలో బోద వ్యాధిగ్రస్థులు ఉన్నారన్న విషయం వినిపిస్తోందన్నారు. గ్రామంలో అత్యధికంగా ఎక్కడా లేని విధంగా 164 మంది రోగులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. భవిష్యత్‌లో బోధ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ జి.వెంకటినాయుడు, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పోరాడ రామ్మోహన్‌రావు, శంభాన గౌరునాయుడు, శంబంగి గోపాల్, మండల పాపినాయుడు, అక్కేన జగన్, సత్యనారాయణ, పకీరునాయుడు పాల్గొన్నారు.