Share News

వారం రోజుల్లో వంద పడకలుగా మార్పు చేస్తా

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:27 AM

రాజాం ఏరియా ఆసుపత్రిని వారం రోజుల్లో వంద పడకల ఆసుపత్రిగా మార్పు చేయిస్తామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు.

వారం రోజుల్లో వంద పడకలుగా మార్పు చేస్తా

  • రాజాం ఎమ్మెల్యే కోండ్రు

రాజాం, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాజాం ఏరియా ఆసుపత్రిని వారం రోజుల్లో వంద పడకల ఆసుపత్రిగా మార్పు చేయిస్తామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహ న్‌ తెలిపారు. గురువారం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో వంద పడకల ఆసుపత్రిగా మార్పించి.. అందుకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసి, వైద్యు లు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డుల ను నియమించేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వార్డుల పనులు జరుగుతున్నందున ఇన్‌ పేషెంట్లు ఉండటానికి ఇబ్బందిగా ఉందని, అంతే కాకుండా రోగులను తనిఖీలు చేయడానికి అవ సరమైన గదులు లేవని.. ఈ గదులను సకా లంలో పూర్తిచేయించేలా చర్యలు తీసుకుం టా మన్నారు. వైద్యులు సకాలంలో విధులకు హాజ రై రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూప రింటెండెంట్‌ ప్రధాన్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సూర్యప్రకాష్‌రావు, రాష్ట్ర తూర్పుకాపు మాజీ చైర్మన్‌ కొల్ల అప్పలనాయుడు, గురవాన నారాయణ రావు, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:27 AM